♪♫
TG-3321
Telugu
స్తోత్రమని స్తుతి స్తోత్రమని పాడెదను ప్రతి క్షణము
stootramani stuti stootramani paadedanu prati kshanamu
16
views
Chorus
స్తోత్రమని స్తుతి స్తోత్రమని పాడెదను ప్రతి క్షణము (2) అనిశము నన్ను మేలులతో నడిపించు చున్న మహారాజా (2) ||స్తోత్రమని||
1వ చరణం
అడిగిన వాటికన్నా ఊహించు వాటి కన్నా (2) అత్యధికముగా దయ చేయుచున్న నా యేసు రాజా ఆరాధన (2) నీ కృప చాలు నీ కృప చాలు (2) ||స్తోత్రమని||
2వ చరణం
ఆత్మాను బంధము చేత సమీప బంధువు చేసి (2) అపురూపమైన సహవాసమిచ్చిన నాయేసు రాజా ఆరాధన (2) నీ కృప చాలు నీ కృప చాలు (2) ||స్తోత్రమని||
3వ చరణం
ఆద్యంతరహితుడా యేసు ఆత్మ స్వరూపుడా యేసు (2) అక్షయరాజ్యం అనుగ్రహించితివే నా యేసు రాజా ఆరాధన (2) నీ కృప చాలు నీ కృప చాలు (2) ||స్తోత్రమని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
