స్తుతి సింహాసనాసీనుడా (దయామయుడా దయాళుడా)
stuti sinhaasanaaseenudaa (dayaamayudaa dayaaludaa)
దయామయుడా దయాళుడా నా జీవితానికి దయాపూర్ణుడా (2)
స్తుతి సింహాసనాసీనుడా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా (2)
అల్లాడిపోతున్న వేళలో ఆసరా కరువైన దుస్థితిలో (2) అలలవలే నీవు నా తోడువై అద్దరికి చేర్చావు నా సాయమై.. నన్ను వీక్షించు దయాళుడా నన్ను రక్షించు దయామయుడా (2) ||స్తుతి సింహాసనాసీనుడా||
కృపవత్సరమును సగితివి దయా కిరీటమును ఇచ్చితివి (2) అందని శిఖరాలనెక్కించి ఆశీర్వాదముతో నింపితివి నన్ను బలపరచచు దయాలుడా నన్ను స్థిరపరచు దయామయుడా (2) ||స్తుతి సింహాసనాసీనుడా|| ఆ….ఆ…..
నా స్తుతుల సింహాసనముపై ఆసీనుడవైన నా యేసయ్య (2) నిన్ను స్తుతియించి భజియించి ఆరాధించెదను నా యేసయ్య నిన్ను పాడెద దయా దయాలుడా నిన్నే పొగడెద దయామయుడా (2) ||స్తుతి సింహాసనాసీనుడా||
దయామయుడా దయాలుడా నా జీవితానికి దయాపూర్ణుడా దయామయుడా దయాళుడా నా జీవితానికి దయపోపూర్ణుడా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
