TG-255
Telugu

సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా

sukha michchegada maaku prabhuyeesuvaa

207
views
పల్లవి

సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా నీ సురుచిరమగు వాక్కు నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చెగద||

1వ చరణం

జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చెగద||

2వ చరణం

నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చెగద||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.