సుఖులారా సంఘంపు బడి సంభంబునకు

sukhulaaraa sanghanpu badi sanbhanbunaku

🎵 TG-588💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి ||సుఖులారా సంఘంపు||

1వ చరణం

విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు ||సుఖులారా సంఘంపు||

2వ చరణం

మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు ||సుఖులారా సంఘంపు||

3వ చరణం

పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి ||సుఖులారా సంఘంపు||

4వ చరణం

ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ బఠియింప దగుఁచిత్రముగ ||సుఖులారా సంఘంపు||

5వ చరణం

మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు ||సుఖులారా సంఘంపు||

6వ చరణం

శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని ||సుఖులారా సంఘంపు||

7వ చరణం

ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ బ్రార్థింతము హితులారా ||సుఖులారా సంఘంపు||

Report Error