♪♫
TG-4327
Telugu
సుందరములు అతి సుందరములు
Sundaramulu Athi Sundaramulu
0
views
పల్లవి
సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2) యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2) తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి||
1వ చరణం
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2) తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2) ||ఏ లేమికి||