సుందరములు అతి సుందరములు సువార్త

sundaramulu athi sundaramulu suvaartha

🎵 TG-2805🌐 Telugu
పల్లవి

సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2)      ||ఏ లేమికి||

1వ చరణం

లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు

Report Error