సుసాధ్యమేగా అసాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలో
Susaadhyameegaa Asaadhyamulannee Upavaasa Praarthanaloo
సుసాధ్యమేగా అసాధ్యములన్నీ ఉపవాస ప్రార్థనలో ఆ...ఆ... ఉపవాస ప్రార్థనలో అందుకో నా ఉపవాస ప్రార్థన ధూపమువోలె నా యేసయ్యా (2) అన్నపానములు విడచి నీ సన్నిధిలో (2) చేసెద నీతో సహవాసమే (2) ||సుసాధ్యమేగా||
అతిక్రమములు జరిగించి అణచబడిరి మా పితరులు (2) ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయెను ఆ ఉరియే (2) అమ్మబడిన వారిని అధిపతులనుగా చేసిన నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2) ||సుసాధ్యమేగా||
కుడి ఎడమలు ఎరుగక దోషము చేసిన ఆ జనములు (2) పశ్చాత్తాప్తులై పసికందులతో ప్రలాపించిరే పరివర్తనతో (2) ఉగ్రత నుండి భద్రతకు శీఘ్రముగా నడిపించిన నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2) ||సుసాధ్యమేగా||
కన్నీటి నైవేద్యము కానుకగా నీకర్పింపగా (2) కనుమరుగాయే కన్నీటి కడలి దీవెనలాయే ఆ నిందలే (2) మా ఉపవాసమునే చూచిన మా స్థితిగతులన్నీ మార్చిన నీదు క్రియలు ఆశ్చర్యమే మహదాశ్చర్యమే (2) ||సుసాధ్యమేగా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.