స్వరమా సుస్వరమా
svaramaa susvaramaa
స్వరమా సుస్వరమా ఇది నా యేసుని వరమా తరమా నా తరమా వివరించతరమా (2) మనసే ఆగిపోయేలా మదిలో మోగిన నామమా (2) నా జీవన రాగమా నీవే యేసయ్యా llస్వరమా సుస్వరమాll
చీకటి రోజుల్లో నన్ను వెతికిన స్వరమా చెదిరిన కలలన్నీ చేర్చిన గానమా (2) నిలువెల్లా నన్ను నింపిన నీవెంత మధురమో (2) వేదన మాటలు నన్ను విడిచిన వేళలో వాక్యమై వచ్చావు జీవిత వేళలో నిశ్శబ్ద గుండెల్లో పుట్టిన ఆరాధనవో llస్వరమా సుస్వరమాll
సిలువ ప్రేమతో పేరు రాసిన కాలమా రక్తముతో తీర్చిన ఋణ బంధమా (2) నా శ్వాసలో నీ సన్నిధి ఎంత సుగంధమో (2) నిను పాడే నోటికి నీవే స్వరమయ్యావు నిను చూసే కంటికి వెలుగైనావు నా కనులా కన్నీటికి నీవే ఆరాధనవో llస్వరమా సుస్వరమాll
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
