స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో మమ్ము కడుగు యేసయ్యా

svasthaparachu yehoovaaneevee neerakthanthoo mammu kadugu yeesayyaa

🎵 TG-1255🌐 Telugu
పల్లవి

స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో మమ్ము కడుగు యేసయ్యా మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే - ఆనందం నీవేగా ||స్వస్థ||

1వ చరణం

ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం ||స్వస్థ||

2వ చరణం

పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము ||స్వస్థ||

Report Error