స్వఛ్చంద సీయోను వాసి
Swachchandha Seeyonu Vaasi
స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి – కస్తూరి పూరాసి (2) వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద||
ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2) లెక్క లేని యద్భుతముల్ (2) మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద||
సంగీతం నాదముల తోడ సీయోను పురము – సొంపుగను చేరితిమి (2) శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2) దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2) మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద||
నీలముల పునాదులు వేసి నీలాంజనములతో – మాణిక్య మణులతో (2) సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2) ప్రశస్త రత్నములతో (2) ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద||
సుమముల హారము సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2) ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2) హిత వత్సరము విముక్తి (2) ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద||
జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2) నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2) అగ్ని మధ్యను నడచినను (2) జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద||
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2) అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2) రహస్యములో మరుగైన (2) ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద||
గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2) నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2) ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2) ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||