♪♫
TG-3402
Telugu
తప్పిపోయిన గొర్రెను నేను
tappipooyina gorrenu neenu
Shyam Josephశ్యామ్ జోసెఫ్ · Shyam Josephపాల్ ఇమ్మానుయేల్ & శ్యామ్ జోసెఫ్ · Paul Emmanuel & Shyam Joseph
1
views
Chorus
తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య (2) యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా (2) ||తప్పిపోయిన||
1వ చరణం
నిన్ను చేరే మార్గములో నేనుండగా ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది (2) నా దారిలో వెలుగువై నా చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రావా నా యేసయ్య (2) ||తప్పిపోయిన||
2వ చరణం
అందరు ఉన్నను ఒంటరినైతిని చెంతనేవున్నను నీకు దూరముగుంటిని (2) నీతోనే నేను ఉండాలని నీతోనే నేను నడవాలని ఆశతో ఉన్నాను యేసయ్య (2) ||తప్పిపోయిన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
