♪♫
TG-4332
Telugu
తార వెలిసింది
Thaara Velisindi
0
views
పల్లవి
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార||
1వ చరణం
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార||
2వ చరణం
బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార||