TG-1732
Telugu

తారా వెలిసెను ఈ వేళ

thaaraa velisenu ee veella

77
views
పల్లవి

తారా వెలిసెను ఈ వేళ యేసు పుట్టిన శుభవేళ (2) వెలిగెను ఈ లోకం – మదిలో నిండెను ఆనందం తరగని రక్షణను – మనకై తెచ్చెను ఆ దైవం రండి వార్తను చాటుదాము ఆ రక్షణను పంచుదాము (2) ||తారా||

1వ చరణం

పశుల పాకే పావనమాయె మంద గొల్లలే తన వారాయె జ్ఞానులొచ్చిరి ఆరాధింప రాజులలో భీతిని నింప పాపమెరుగని నీతి పరుడు లోకమును కాచే రక్షకుడు కన్య మరియా గర్భమున పుట్టెను దేవుని అంశమున రాజులకు రాజైన తనకు ఇచ్చుటకు ఏమున్నది మనకు వెండి బంగారముల కన్నా హృదములనర్పిస్తే మిన్నా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.