తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా

thalli odiloo pavallinchee biddavalenee - thandri nee vadiloo nee odigithinayyaa

🎵 TG-1065🌐 Telugu
పల్లవి

తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా (2)

1వ చరణం

వేదన లేదు శోధనలేదు - నీ హస్తము విడువనయ్యా (2) భయమన్నది లేనే లేదు - ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి ||తల్లి ఒడిలో||

2వ చరణం

నీ ఉపకారం స్మరియించి - స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను. చేయివిడువని నా యేసయ్యా - కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా. ||తల్లి ఒడిలో||

3వ చరణం

మంచికాపరి జీవకాపరి - హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా - ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా. ||తల్లి ఒడిలో||

4వ చరణం

నిన్ను నేను పట్టుకొంటిని - భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను. నీ రెక్కల నీడలోనుండి - లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని ||తల్లి ఒడిలో||

5వ చరణం

రేయింపవలు వెతికానయ్యా - నీకై వేచితిని నే నీకై వేచితిని నా జీవితకాలమంతా - నీ నామం చాటెదను నే నీనామం చాటెదను ||తల్లి ఒడిలో||

Report Error