TG-440
Telugu

తనువు నా దిదిగో గై

thanuvu naa didigoo gai

209
views
పల్లవి

తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే యను శక్తి నీయుమీ ||తనువు నా||

1వ చరణం

ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త వినయ పాదము లివిగో ||తనువు నా||

2వ చరణం

స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి పూర్ణముగ నింపు ||తనువు నా||

3వ చరణం

వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ జ్ఞానం బిదిగో ||తనువు నా||

4వ చరణం

నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ కీయ సింహాసనమౌ ||తనువు నా||

5వ చరణం

ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ నుండెదఁ ||తనువు నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.