TG-4342
Telugu

తప్పిపోయిన కుమారుడనయ్యా

Thappipoyina Kumaarudanayyaa

26
views
పల్లవి

తప్పిపోయిన కుమారుడనయ్యా తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా కాదనకయ్యా నా కన్న తండ్రి తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2) అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2) ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) ||కాదనకయ్యా||

1వ చరణం

పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2) ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) ||కాదనకయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.