TG-4350
Telugu

తేనెకన్న తీయనైనది

Thenekanna Theeyanainadi

16
views
పల్లవి

తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||

1వ చరణం

ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2) అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||

2వ చరణం

నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2) ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.