TG-4352
Telugu

తొలకరి వాన

Tholakari Vaana

22
views
పల్లవి

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును (2) ||తొలకరి||

1వ చరణం

ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును (2) ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2) ||అది నూతన||

2వ చరణం

సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2) యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2) ||అది నూతన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.