TG-4357
Telugu

త్రిత్వైకమా

Thrithvaikamaa

0
views
పల్లవి

త్రిత్వైకమా సకలేశ్వరా పూజ్యుడౌ శ్రేయస్కరా (2) ధ్యానించెద హృది వాంఛతో గళమెత్తెద మృదు భాషతో నా సుతుడా సర్వే సుతుడా నా జనకా సర్వే జనకా ||త్రిత్వైకమా||

1వ చరణం

దోష భావముకు బంధునవ్వగా దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2) వాక్యపు వెలుగై నాకిల వెలుగై ముక్తినిచ్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||

2వ చరణం

క్షితియందు ఎరకు మోసిపోతిని క్షమలేక ఇలలో మృతమైతిని (2) వెల దాతవై జీవ దాతవై స్థితి మార్చిన నీకు వందనం (2) ||త్రిత్వైకమా||