TG-591
Telugu

త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు

thryeeka deevumda yehoova deevu

207
views
పల్లవి

త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే నమ్మి సేయుదు సేవ దేవ పరలోక భూలోక ముల నెల్లఁ బుట్టించి పాలించు తండ్రి దే వుని నమ్మెదను నేను ||త్ర్యేక దేవుఁడ||

1వ చరణం

శ్రీ దేవసుతుఁ డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవునిఁ గూర్మితో నమ్మెదఁ ||త్ర్యేక దేవుఁడ||

2వ చరణం

పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద దేవ కొట్టఁబడి చనిపోయి పెట్టఁబడి భూమిలో మూఁడవ దినమందు మృతి గెలిచి లేచెను ||త్ర్యేక దేవుఁడ||

3వ చరణం

పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికిఁ గుడివైపు దేవ సింహాసనముమీఁద స్థిరముగాఁ గూర్చుండి యున్నాఁడు చిరన్యాయ కర్తయై యున్నాఁడు ||త్ర్యేక దేవుఁడ||

4వ చరణం

అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగఁ దీర్పుఁ దీర్చుటకు దేవ మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబుఁ దీర్చును న్యాయవంతుఁడు యేసు ||త్ర్యేక దేవుఁడ||

5వ చరణం

శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను నిజ మిది ||త్ర్యేక దేవుఁడ||

6వ చరణం

పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా నమ్మెదఁ ||త్ర్యేక దేవుఁడ||

7వ చరణం

నిత్యజీవము నమ్మెదను నేను నిజముగా శ్రీ యేసు పేర దేవ నిత్యుండు తండ్రి దే వుఁడు కుమారుండును ఆత్ముండు సత్యుండు త్ర్యేకుఁడౌ దేవుండు ||త్ర్యేక దేవుఁడ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.