♪♫
TG-1958
Telugu
తూర్పు దిక్కు చుక్క బుట్టె
thuurpu dikku chukka butte
72
views
పల్లవి
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా (2) చుక్కను జూచి మేము వచ్చినాము మొక్కి పోవుటకు ||తూర్పు దిక్కు||
1వ చరణం
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా గొప్ప బాలుడమ్మా మన పాపముల బాప పుట్టెనమ్మా మహిమవంతుడమ్మా పశువుల పాకలోని బాలుడమ్మా పాపరహితుడమ్మా పాపంబు బాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము బాల యేసు నొద్దకు బంగారు పాదముల మ్రొక్కెదము బహుగ పాడెదము
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.