త్యాగమెంత చేసావు దేవా నా
thyaagamentha cheesaavu deevaa naa
🎵 TG-2048🌐 Telugu
పల్లవి
త్యాగమెంత చేసావు దేవా నా పాపమంత కడిగావా నేస్తం (2) ఓ యేసయ్యా… నా నేస్తమా… (2) ||త్యాగమెంత||
1వ చరణం
గెత్సేమనే తోటలో ఒంటరివై మిగిలావా ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా కన్నీరు తుడిచి కల్వరికి నడిచావా (2) ||ఓ యేసయ్యా||
2వ చరణం
తల వాల్చుటకైన నీకు తావే లేదుగా తల్లడిల్లు నాకు త్రోవ చూపించినావా స్వస్థత నాకిచ్చి సిలువ నీవు మోసావా (2) ||ఓ యేసయ్యా||