ఉదయించినాడు
Udayinchinaadu
ఉదయించినాడు నా జీవితాన నా నీతిసూర్యుడు నా యేసయ్యా నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2) సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు||
మతిలేని నా జీవితాన్ని – మరువలేదు నా మెస్సయ్యా (2) మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు||
గురిలేని ఈ యాత్రలోన – గుర్తించి నన్ను పిలిచెను (2) గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటినే (2) గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు||
కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2) కడతేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏతెంచెను (2) ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.