ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు
udayinchinaamdu kreesthumdu neemdu udayinchinaamdu
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయౌ మరియ నందనుఁడై యిమ్మానుయేల్ సదయుఁడై చెడియున్న పృథివికి నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగను సాధు జనముల హృదయముల ముద మెదుగునట్లుగ ||ఉదయించినాఁడు క్రీస్తుఁడు||
ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనముపై తగ దేవుఁడును దా నొక్కఁడు చిర జీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడఁబడి ||ఉదయించినాఁడు క్రీస్తుఁడు||
యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మీదుఁ జూడని వారి కారుండ వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ డౌ దయాళుఁడు ప్రాణ మీడుటకు ||ఉదయించినాఁడు క్రీస్తుఁడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.