ఉన్నావు దేవా యుగయుగములు
Unnaavu Deevaa Yugayugamulu
ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు ఉందునన్నావు సదాకాలము యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై ||ఉన్నావు||
1. మోషేకు తోడై ఉన్నవాడనీవే నీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2) అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే ఆకాశమునుండి ఆహార మిచ్చితివే బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే ||ఉన్నావు||
2. సింహాల బోనులో దానియేలుతో ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2) ఐగుప్తునందున యేసేపుకు తోడై ఆశీర్వదించి అధిపతిగ చేసితివే శ్రమలలో నాతోడై వుందనన్నావే ||ఉన్నావు||
3. కన్నీటి లోయలో కష్టాల కడలిలో అద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2) నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే నీ కంటి పాపలా కాపాడు దేవుడవే ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే ||ఉన్నావు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.