ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
Unnatha Sthalamulapai Nekkinchi Choopinchu Prabhu
ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరము సుందర మొందు సదా (2) 1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె మరణపు ముల్లును విరచి జయంబును యేసు అనుగ్రహించెన్ (2) 2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి సంతస మొందెదరు (2) 3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును నిశ్చయముగా బహు బుద్ధివివేకము లిచ్చి నడుపు సదా (2) 4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును వంచనలేక వాక్యమునకు తలవంచి విధేయులౌదురు (2) 5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను నడువుడి త్రోవయిదే యను శబ్దము చెవులకు వినబడును (2) 6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి రక్షణ కర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా (2) 7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు అందమైన యా పరలోక రాజ్యము ప్రబలుట చూచెదవు (2)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.