TG-4679
Telugu

ఉన్నతమైన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ

Unnathamaina Preema Athyunnathamaina Preema

0
views
పల్లవి

ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా 1.  నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2) మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2) ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా ||ఉన్నతమైన ప్రేమ||

1వ చరణం

2. నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2) నీవు కార్చిన రక్తమే నా - ముక్తి మార్గమై (2) ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా ||ఉన్నతమైన ప్రేమ||