ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ

uuhinchaleenayyaa vivarinchaleenayyaa enaleeni nee

🎵 TG-2927🌐 Telugu
పల్లవి

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ||

1వ చరణం

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము

Report Error