TG-4375
Telugu

వాడుకో యేసయ్

Vaaduko Yesayyaa

0
views
పల్లవి

వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా – (2) వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక||

1వ చరణం

నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో||

2వ చరణం

నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో||

3వ చరణం

నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో||

4వ చరణం

నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||