TG-2244
Telugu

వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే

vaadukoo… yeesayyaa…. poddu vaalipookamundee

58
views
పల్లవి

వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా – (2) వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక||

1వ చరణం

నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో||

2వ చరణం

నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.