TG-472
Telugu

వారు భాగ్యవంతు లౌదురు భూ

vaaru bhaagyavanthu lauduru bhuu

216
views
పల్లవి

వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు వారు భాగ్యవంతులౌదురు చారు శుభవార్తా రవంబు గోరి యాకర్ణించి భక్తి మీరఁ దెలిసికొనిన యట్టి ధీరు లెవ్వ రెవ్వరో ||వారు భాగ్యవంతు||

1వ చరణం

వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనములఁ బొలుపు మీరఁ జుట్టుకొనును ||వారు భాగ్యవంతు||

2వ చరణం

విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల అమందముగ హెచ్చరించు నతని నీతి రీతిఁ దజ్జ నముల కోర్కె వృద్ధి బొం దంగఁ జేయు సంతతంబు ||వారు భాగ్యవంతు||

3వ చరణం

నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుఁడు బలము రక్షయు న వారితముగ మనకు నిచ్చు ||వారు భాగ్యవంతు||

4వ చరణం

వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు సురుచిరముగ శాశ్వతముగఁ పరిపాలించు మీ దేవుఁడు నిరతముగను జీవించు నీతి భరిత చిత్తుఁడగుచు ||వారు భాగ్యవంతు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.