TG-542
Telugu

వారు ధన్యు లైన పిల్లలు

vaaru dhanyu laina pillalu

210
views
పల్లవి

వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు వారు ధన్యులైన పిల్లలు కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన వారికిని విధేయులైన ||వారు ధన్యు||

1వ చరణం

అన్నదములందు నెటులను తనతోడ నాడు చున్న యితరులందు నటులను భిన్న మెంచ కొక్కరీతిఁ దన్నుఁబోలె ప్రియ మొనర్చి తిన్నని బడియందు నేర్చు చున్నవార లెవ్వరో ||వారు ధన్యు||

2వ చరణం

ఒక్కఁడె తండ్రి యతఁడు దేవుఁడు మన కందరకును సకల సుఖములిచ్చు నెప్పుడు అకట మన మిఁకను జగడము లాడఁదగదు ప్రభుని రీతి నొకని నొకఁడు ప్రియము చేసి యుండుద మని తలఁచుచుండు ||వారు ధన్యు||

3వ చరణం

మంచి మేలు లనుభవింపఁగఁ గరుణించి దేవుఁ డెంచి మనల నిచటఁ గూర్చెఁగ వంచనలఁ ద్యజించి కనిక రించి యొకనినొకఁడు మది స హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు ధన్యు||

4వ చరణం

ఆకసమున నున్న దేవుఁడు మన మనసు రాక పోక లన్ని చూచు నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగఁ జేసి ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో ||వారు ధన్యు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.