TG-4378
Telugu

వాటి వాటి కాలమున

Vaati Vaati Kaalamuna

0
views
పల్లవి

వాటి వాటి కాలమున అన్నిటిని అతి మనోహరముగా చేయువాడా (2) యేసయ్యా.. యేసయ్యా.. నా దైవం నీవేనయ్యా (2) ||వాటి వాటి||

1వ చరణం

ఆశ భంగం కానేరదు మంచి రోజు ముందున్నది (2) సత్క్రియను ఆరంభించెను ఎటులైన చేసి ముగించును (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను ఎటులైన చేసి ముగించును (2) ||యేసయ్యా||

2వ చరణం

అద్భుతములు చేసెదను నీ తోడుంటానంటివి (2) నా ప్రజల ఎదుట నీవు (నను) హెచ్చింప చేసెదవు (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను హెచ్చింప చేసెదవు (2) ||యేసయ్యా||

3వ చరణం

ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసెదవు (2) ఆకాశ తార వలె భువిలో ప్రకాశింతును (2) (నే) రూఢిగా నమ్ముచున్నాను భువిలో ప్రకాశింతును (2) ||యేసయ్యా||