వందనాలు యేస
Vandanaalu Yesu
వందనాలు యేసు నా వందనాలో వందనాలు శతకోటి వందనాలు (2) అబ్రాహాము దేవా నా వందనాలు ఇస్సాకు దేవా నా వందనాలు (2) అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా యాకోబు దేవా నా వందనాలు (2) నన్ను పిలిచావు వందనాలో నన్ను కలిసావు వందనాలు (2) నన్ను మరువలేదు వందనాలో నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు||
మహిమనే విడిచావు వందనాలు మహిలోనికి వచ్చావు వందనాలు (2) మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు మార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||
మరణమే గెలిచావు వందనాలు మహిమనే చూపావు వందనాలు (2) మరణమే గెలిచావు – మహిమనే చూపావు మాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||
సిలువనే మోసావు వందనాలు నా బరువునే దించావు వందనాలు (2) సిలువనే మోసి – నా బరువునే దించి నా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు||
నా తోడు నీవే నా వందనాలు నా నీడ నీవే నా వందనాలు (2) నా తోడు నీవే – నా నీడ నీవే నా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు||