TG-5720
Telugu

వే వేళ మందిపై కృప చూపువాడా విడువక నాపై నీ కృప చూపుచున్నావు

Vee Veella Mandipai Krupa Choopuvaadaa Viduvaka Naapai Nee Krupa Choopuchunnaavu

26
views
పల్లవి

వే వేళ మందిపై కృప చూపువాడా విడువక నాపై నీ కృప చూపుచున్నావు వెంటాడుచున్నావు వదలలేనన్నావు విడువక నాపై నీ దయ చూపుచున్నావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్య (2) అత్యంత కృప కలిగి రక్షించినావు అన్నిటిని సమకూర్చి ఆశీర్వదించావు ఆలోచన చెప్పి నడిపించుచున్నావు అండగా వుండి తండ్రినివైనవు వెంటాడుచున్నావు వదలలేనన్నావు విడువక నాపై నీ దయ చూపుచున్నావు ||యేసయ్యా||

1వ చరణం

నిన్ను ప్రేమించి నీకు భయపడితే నీ ఆజ్ఞ గైకొంటే నీ మాటవింటే వెయ్యి తరాల కరుణను చూపిస్తానంటివే తరతరాల కృపతో నింపుతానంటివే వెంటాడుచున్నావు వదలలేనన్నావు విడువక నాపై నీ దయ చూపుచున్నావు ||యేసయ్యా||

2వ చరణం

శాంతి సంతోషం నాకిచ్చినావు శోధనలలో నన్ను కాపాడుచున్నావు శ్రమదినమున నన్ను కృంగవదన్నావు శాశ్వత దీవేన నికిచ్చేదనన్నావు. వెంటాడుచున్నావు వదలలేనన్నావు విడువక నాపై నీ దయ చూపుచున్నావు ||యేసయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.