TG-134
Telugu

వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! మా

veekuvachukkala shreesstthamau daanaa! maa

212
views
పల్లవి

వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా! మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా.

1వ చరణం

చల్లమంచాయన తొట్టిపై నొప్పు పశులతో భువిబరుండెను కున్నెడు నాయన దూతల మ్రొక్కు నందర స్రష్ట, రాజు, రక్షణ. ||వేకువచుక్కల శ్రేష్ఠమౌ||

2వ చరణం

ఆయనకు మంచికాన్కలిత్తమా! ఏదోం సువాసనల ద్రివసుల్ వార్ది ముత్యాల్ కానబోళంబుఖని స్వర్ణము నిత్తమా యాయనకు. ||వేకువచుక్కల శ్రేష్ఠమౌ||

3వ చరణం

నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు కాన్కల నాయన ప్రేమరాదు అన్నిట డెందము బీదల మొరల్ దేవుని కిష్టము లౌకాన్కలు. ||వేకువచుక్కల శ్రేష్ఠమౌ||

4వ చరణం

వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా మా బాలరక్షకు జూపింపుమా. ||వేకువచుక్కల శ్రేష్ఠమౌ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.