♪♫
TG-4391
Telugu
వీనులకు విందులు చేసే
Veenulaku Vindulu Chese
0
views
పల్లవి
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||
1వ చరణం
రండి… విన రారండి యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||
2వ చరణం
రండి… వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి (2) నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||
3వ చరణం
సృష్టి కర్తను మరచావు నీవు సృష్టిని నీవు పూజింప దగునా (2) భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) రండి… ||వీనులకు||