వీరుల మయ్యా జయ వీరుల

veerula mayyaa jaya veerula

🎵 TG-359💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల మయ్యా||

1వ చరణం

మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల మయ్యా||

2వ చరణం

పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా ||వీరుల మయ్యా||

3వ చరణం

అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల మయ్యా||

4వ చరణం

భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ మైనఁ బెట్టువారము ||వీరుల మయ్యా||

Report Error