TG-4395
Telugu

వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు

veetagaani uriloo nundi naa praanaanni rakshinchaavu

29
views
పల్లవి

వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు (2)

పల్లవి పూర్వ భాగం

లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన (2)

1వ చరణం

రాత్రి వేళ భయముకైననూ పగటి వేళ బాణమైననూ (2) రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

2వ చరణం

వేయిమంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా (2) అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||

3వ చరణం

మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు (2) రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.