TG-5718
Telugu

వెలసెనులే గగనాన తూర్పుతార నిశీధిరేయి జాములో

Velasenulee Gaganaana Thoorputhaara Nisheedhireeyi Jaamuloo

0
views
పల్లవి

వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని ||శుభవార్త||

1వ చరణం

జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము ||శుభవార్త||

2వ చరణం

మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే ||శుభవార్త||