♪♫
TG-2566
Telugu
వెండి బంగారాల కన్న మిన్న
vendi bangaaraala kanna minna
68
views
పల్లవి
వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి||
1వ చరణం
లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమ (2) లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
2వ చరణం
ఏ స్థితికైనా చాలిన ప్రేమ నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2) నీకు బదులు మరణించిన ప్రేమ చిర జీవము నీకొసగిన ప్రేమ యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
