TG-2974
Telugu

వెండి బంగారములకన్నా - యేసుని కలిగియుండెదము

vendi bangaaramulakannaa - yeesuni kaligiyundedamu

వెండి బంగారములకన్నా - యేసుని కలిగియుండెదము
2
views
Chorus

వెండి బంగారములకన్నా - యేసుని కలిగియుండెదము వెలగల భూషణములకన్నా - యేసుని కలిగియుండెదము (2)

1వ చరణం

అడవిరాజు తన పిల్లలును - లేమికలిగి ఆకలిగొనును (2) దేవుని ఆశ్రత జనులకు ఎప్పుడు (2) మేలులు కొదువై యుండవుగా (2) ||వెండి||

2వ చరణం

మన ప్రభుండు మహదేవుండు - ఘనమహాత్యము గలరాజు (2) రక్షణకర్త ప్రధానకాపరి (2) ఆయన మేపెడి గొర్రెలము (2) ||వెండి||

3వ చరణం

వారి గుర్రములు రథములను - బట్టిజనులు గర్వించెదరు (2) మనమైతే మన దేవుని నీతి (2) న్యాయములను శ్లాగించెదము (2) ||వెండి||