TG-5716
Telugu

వెంటే ఉంటానంటు నను వెంబడించిన

Ventee Untaanantu Nanu Venbadinchina

26
views
పల్లవి

వెంటే ఉంటానంటు నను వెంబడించిన నా మంచి నజరేయుడా ఆపదలో తండ్రీ అని పిలవగానే నాముందు నిలిచే నజరేయుడా (2) నజరేయుడా నను నడిపించే నాయకుడా స్తుతి పాత్రుడా నా స్తోత్రార్పన నీకేనయ్యా (2) సాక్ష్యములెన్నునా సంభాషణలకే పరిమితమై నిజస్నేహితుడా నిను మరుగున పెడితినేమో? (2) ఐనా నను క్షమియించి చేరదీసినావే నూతన సాక్ష్యముతో తిరిగి నిలబెట్టినావే (2) నీ వెంటే నేనుండ నీ కోరిక ఐనా దేవా నా వెంటే నీవుండి నా కోరిక తీర్చావయ్యా (2) అందుకే నా మంచి యేసయ్యా నిను శిరస్సుపై నిలబెట్టా స్వాగతమయ్యా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.