♪♫
TG-4394
Telugu
వేసారిన మనసే ఊగెనే
Vesaarina Manase Oogene
25
views
పల్లవి
వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే యే గాయమైన మానదే నాకున్న బలము చాలదే (2) వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన||
1వ చరణం
కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే తాళలేను లేసమైన నీ కోపమే భారము మోపకే లోపమూ చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన||
2వ చరణం
వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా ఉండునే – త్రోవను చూపునే చేకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.