TG-4399
Telugu

విధేయతకే అర్ధము

Vidheyathake Ardhamu

0
views
పల్లవి

విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా అవిధేయత తొలగించుమయ్యా నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే||

1వ చరణం

పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత||

2వ చరణం

పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2) రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||