TG-1978
Telugu

విడువను నిను ఎడబాయనని నా

viduvanu ninu edabaayanani naa

80
views
పల్లవి

విడువను నిను ఎడబాయనని నా కభయ మొసంగిన దేవా నా కభయ మొసంగిన దేవా నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను||

1వ చరణం

పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.