♪♫
TG-4402
Telugu
విడువవు నన్నిక
Viduvavu Nannika
0
views
పల్లవి
విడువవు నన్నిక ఎన్నడైననూ పడిపోకుండా కాయు రక్షకా (2) పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు||
1వ చరణం
ప్రభువా నీకవిధేయుడనై పలు మారులు పడు సమయములలో (2) ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు||
2వ చరణం
ఆదాము హవ్వలు ఏదెనులో ఆశతో ఆజ్ఞ మీరినను (2) సిలువకు చాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు||
3వ చరణం
మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా (2) కొల్లగా నీ ఆత్మను నొసగితివి హల్లెలూయా పాడెదను (2) ||విడువవు||