విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు
vijaya geethamul paadaree kreesthuku
విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ నిజ కుమారుని నామమున్ హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ||
మంగళముగ యేసుడే మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను రంగు మీరగదన – రక్త బలము వలన పొంగు నణగ జేసెను సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను పాపముల్ దొలగింపను మనలను దన స్వ – రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ – కోపమున్ భరియించెను పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు పాప యాగము దీర్చెను దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ||
సిలువ మరణము నొందియు మనలను దనకై – గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||