TG-216
Telugu

విజయంబు విజయంబు విజయంబు మా

vijayanbu vijayanbu vijayanbu maa

204
views
పల్లవి

విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద ||విజయంబు విజయంబు||

1వ చరణం

విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత మృత్యువు నుండి విజయుండై వేంచేసె ||విజయంబు విజయంబు||

2వ చరణం

విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము ||విజయంబు విజయంబు||

3వ చరణం

విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు ||విజయంబు విజయంబు||

4వ చరణం

విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు ||విజయంబు విజయంబు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.