విజయశీలుడా
Vijayaseeludaa
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) నా యేసయ్యా నిను వేడుకొనగా నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా||
అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2) ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) నిత్యానందము కలిగించె నీ శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా||
ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2) అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2) నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా||
ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2) అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2) నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.